దేశానికి జమిలి ఎన్నికలు అవసరం: మోదీ

by Anukaran |
దేశానికి జమిలి ఎన్నికలు అవసరం: మోదీ
X

న్యూఢిల్లీ: సువిశాల భారత దేశానికి జమిలి ఎన్నికలు ఎంతో అవసరమని, నెలల వ్యవధిలో పదే పదే ఎన్నికలు నిర్వహించడం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అందుకే జమిలి ఎన్నికలు నిర్వహించడంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ విషయం చర్చకు మాత్రమే పరిమితం చేయకూడదన్నారు. గురువారం రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని గుజరాత్‌‌లో జరిగిన అసెంబ్లీ వ్యవహార ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దేశంలో వేర్వేరు ఎన్నికలకు వేర్వేరు ఓటరు జాబితాలు ఉన్నాయని, వీటివల్ల డబ్బు, టైమ్ ఎందుకు వృథా చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లోక్‌సభ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు ఒకే ఓటరు జాబితా ఉండాలని, దీనిపై ప్రిసైడింగ్ అధికారులు దృష్టిసారించాలని సూచించారు. కేవలం దేశ అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు మన ప్రాధాన్యతగా ఉండాలని, రాజకీయాలు కాదని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed