ఇవాళ జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం

by Shamantha N |
ఇవాళ జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం
X

ప్రధాని మోదీ ఇవాళ రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. మూడోసారి పొడిగించిన లాక్‌డౌన్ మరో వారం రోజుల్లో.. అనగా మే 17న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. లాక్‌డౌన్ కొనసాగిస్తూ నిబంధనలను సడలించే అంశంపై ప్రధాని ప్రకటన చేసే అవకాశం ఉంది. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై సోమవారం సీఎంలతో ప్రధాని మోదీ సవివరంగా చర్చించారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఆగటం లేదు. రోజురోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్‌జోన్ ఏరియాలో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తూ.. మిగతా ప్రాంతాల్లో ఆంక్షలను సండలించే అవకాశం ఉంది.

Advertisement

Next Story