అధికారులు ఎటు పోయారని ఎమ్మెల్యే ఆగ్రహం

by Shyam |
అధికారులు ఎటు పోయారని ఎమ్మెల్యే ఆగ్రహం
X

దిశ, వరంగల్: హన్మకొండ బాలసముద్రంలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసులో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. కార్యాలయంలో అధికారులు ఎవ్వరూ లేకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆఫీసులోనే ఉండటం లేదన్న ఆరోపణలతో ఎమ్మెల్యే తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, కింది స్థాయి సిబ్బంది మాత్రమే కార్యాలయంలో ఉండడంతో ఆయన అసంతృప్తి చెందారు. వెంటనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు కాల్ చేసి మందలించారు. మళ్లీ ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని వినయ్ భాస్కర్ ఆదేశించారు.

Advertisement

Next Story