వందశాతం న్యాయం చేయడమే ‘వనమా’ సిద్ధాంతం

by Sridhar Babu |   ( Updated:2021-08-07 07:57:22.0  )
MLA Vanama Venkateswara Rao
X

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని 16 వార్డులో ఇల్లు కోల్పోయిన బాధితులు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. శనివారం ఇల్లు కోల్పోయిన బాధితులను కలిసి వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌‌తో సమావేశమై బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని తెలిపారు. బాధితులకు ఇల్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నా నియోజకవర్గంలో పేదవాడికి కష్టం వస్తే ముందుండేది ఎమ్మెల్యే వనమా అని అన్నారు.

ప్రజలు చల్లగా ఉంటే నేను చల్లగా ఉంటాను అని వెల్లడించారు. 2008వ సంవత్సరంలో రైల్వే స్థలంలో ఇల్లు కోల్పోయిన అందరికీ పాత కొత్తగూడెంలో స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇప్పుడు కూడా బాధితులు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని 100 శాతం న్యాయం చేయడమే వనమా సిద్ధాంతం అన్నారు. పాత కొత్తగూడెంలో ఉన్న డబుల్ బెడ్ రూంల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు సాధ్యమైనంత ఫాస్ట్‌గా ఇల్లు మంజూరు చేసి మాట నిలుపుకుంటామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed