వాళ్ల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణం..!

by srinivas |   ( Updated:2021-08-23 06:00:34.0  )
sridevi
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ అక్రమాలకు ప్రధాన సూత్రధారుడు చంద్రబాబేనని ఆరోపించారు. 300 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యకు చంద్రబాబు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులను సీఎం జగన్ సరిదిద్దుతున్నారని చెప్పుకొచ్చారు. 1996లో అగ్రిగోల్డ్‌కు అనుమతులిచ్చింది చంద్రబాబునాయుడేనని అన్నారు. చివరికి అగ్రిగోల్డ్ బోర్డు తిప్పింది కూడా చంద్రబాబేనని ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను తెలుగుదేశం పార్టీ నేతలు కాజేశారన్నారు. వైఎస్ జగన్ పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.10 వేల లోపు బాధితులకు ఇప్పటికే న్యాయం చేశారు. తమ ప్రభుత్వం రూ.20 వేలలోపు బాధితులకు రూ.500 కోట్లతో న్యాయం చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేసిన పాపాలకు.. సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు.

Advertisement

Next Story