- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించండి
దిశ, భువనగిరి: భువనగిరి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు కావాల్సిన మౌళిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆస్పత్రిలోని కొవిడ్ వార్డును ఎమ్మెల్యే సంరద్శించారు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి సూపరింటెండెంట్ రవిప్రకాశ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అంతేగాకుండా.. ఆస్పత్రిలో కరోనా బాధితులకు అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో రూ. 6 లక్షల వ్యయంతో విశ్రాంతి గది, రూ. 3 లక్షల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణాలు, రూ.50 వేల వ్యయంతో కరోనా రోగులకు క్యూ లైన్ తడకలను తన సొంతనిధులతో నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆస్పత్రి ముందు భాగంలో సీసీ రోడ్డు వేయిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సాంబశివరావు, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, డాక్టర్ చందు తదితరులు పాల్గొన్నారు.