సామాజిక సేవలు అభినందనీయం.. ఎమ్మెల్యే సండ్ర ప్రశంస

by Sridhar Babu |
MLA Sandra Venkata Veeraiah
X

దిశ, కల్లూరు: చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై సైకిల్స్, వీల్ చైర్స్ అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శుక్రవారం కల్లూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్లూరు, తల్లాడ, పెనుబల్లి మండలాల్లోని వికలాంగులకు 40 ట్రై సైకిల్స్, 20 వీల్ చైర్స్‌లను ఎమ్మెల్యే అందజేశారు.

అనంతరం రూ.94 లక్షల విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం సండ్ర మాట్లాడుతూ… వికలాంగులకు ట్రై సైకిల్స్, వీల్ చైర్లు అందించడం అభినందనీయమన్నారు. వారి అవసరాలకు ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయని, దూరపు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. చేతన ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయం అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ వీపీ.గౌతమ్, సీపీ విష్ణు ఎస్.వారియర్, ఫౌండేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, కార్యదర్శి రంగారావు, సభ్యులు సురేష్ చంద్రకానీ, నవీన్, షేక్ రషీద్, నారాయణ రావులతో పాటు DCMS జిల్లా చైర్మన్ అధ్యక్షులు వెంకట శేషగిరిరావు, కల్లూరు ఎంపీపీ రఘు, జెడ్పీటీసీ అజయ్ కుమార్, సర్పంచ్ నీరజ రఘు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామారావు, డీసీసీబీ డైరెక్టర్ లక్ష్మణ రావు, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story