రామన్న చెప్పిండు… రేఖక్క ఊడ్చింది

by Aamani |
రామన్న చెప్పిండు… రేఖక్క ఊడ్చింది
X

దిశ, ఆదిలాబాద్: ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాలు పారిశుద్ధ్యానికి సమయం కేటాయించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ శాసనసభ్యురాలు రేఖాశ్యాం నాయక్ ఆదివారం ఉదయం తన నివాసంలో చీపురు పట్టి ఊడ్చారు. ఇల్లంతా స్వయంగా తానే పరిశుభ్ర పరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు.

Advertisement

Next Story