ఇకనుంచి అతనికి పార్టీలో చోటులేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్

by Sridhar Babu |
MLA Podem Veeraiah
X

దిశ, మణుగూరు: పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో-కన్వీనర్‌గా పనిచేస్తూ కాంగ్రెస్ అభివృద్ధి కోసం పరితపిస్తోన్న గురిజాల గోపిని భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య, మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్‌లు అభినందించారు. శనివారం మణుగూరు కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొదేం వీరయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం గురిజాల గోపి రాత్రింబవళ్లు కష్టపడ్డాడని, కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ స్థాయిని పెంచుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే గోపిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ పరిషత్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నామని తెలియజేశారు. అలాగే, మహిళా విభాగంలో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ, మహిళల కోసం దైర్యంగా నిలబడుతున్న పోరెడ్డి విజయలక్ష్మిని జిల్లా పంచాయతీ పరిషత్ జనరల్ సెక్రెటరీగా నియమిస్తన్నట్లు ప్రకటించారు.

అనంతరం పదవులు పొందిన వీరిని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్‌లు సన్మానించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో వర్గవిబేధాలు సృష్టిస్తూ, పార్టీ పరువు తీస్తున్న మండల కార్యకర్త పొలమూరి రాజును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇకనుంచి పార్టీకి, అతనికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, పినపాక అసెంబ్లీ మహిళా కన్వీనర్ బర్ల నాగమణి, సాంబయ్య, రజిని, సీనియర్ నాయకులు పాల్వంచ రాములు, రాంమూర్తి, వేణు, కిషన్, షాబీర్, శబన పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed