పోలీసులు, వైద్య సిబ్బందికి సహకరించండి

by Shyam |
పోలీసులు, వైద్య సిబ్బందికి సహకరించండి
X

దిశ, మహబూబ్‎నగర్: ప్రజలందరూ లాక్‎డౌన్ నిబంధనలు పాటించి పోలీసులు, వైద్య సిబ్బందికి సహకరించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గం మద్దూరు, కోస్గిలో ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆయన ప్రారంభించ్చారు. అనంతరం కోస్గి మున్సిపాలిటీలో కరోనా నివారణ కోసం హైపోక్లోరైడ్‌ పిచికారి చేశారు. పలు గ్రామాల్లోని పేదలకు, వలస కూలీలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ మహమ్మారితో భయపడాల్సిన అవసరం లేదని.. ప్రజలకు, రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. రైతు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేయిస్తామన్నారు.పేదలు ఇబ్బందులు పడకుండా.. ప్రతీ ఒక్కరికీ 12 కేజీల బియ్యం, ప్రతీ రేషన్ కార్డు దారులకు రూ. 1500 అందించేందుకు సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేశారని ఎమ్మెల్యే నరేందర్ గుర్తుచేశారు.

Tags: mla patnam narendar reddy, comments, lockdown, kodangal

Advertisement

Next Story