కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

by Kalyani |
కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుల కోసం చేనేత కళాకారుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు వి. ఇందిర మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులను ప్రధానం చేయనుందని, ఇందుకోసం 2024 డిసెంబర్ 31 నాటికి 30 సంవత్సరాల వయస్సు నుండి 10 సంవత్సరాల అనుభవం కలిగిన చేనేత కళాకారులు, చేనేత డిజైనింగ్ లో 25 సంవత్సరాల వయస్సు నుండి 5 సంవత్సరాల అనుభవం ఉన్న వారు అర్హులని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు అవార్డు కోసం ఏప్రిల్ 15వ తేదీ లోగా హైదరాబాద్ లోని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Advertisement
Next Story

Most Viewed