కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించాలి

by Kalyani |
కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించాలి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించి హైదరాబాద్ ను దేశంలోనే ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ యోగేష్ దూబే అధికారులకు సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం మహిళా శిశు సంక్షేమశాఖ, దివ్యాంగుల సంక్షేమ శాఖ, ఉపాధి కల్పన, లీడ్ బ్యాంక్, ఎస్సీ, ఎస్,టి, బిసి అధికారులతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జావిద్ ఆక్తార్ లతో కలిసి ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు, దివ్యాంగులు అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు.

హైదరాబాద్ జిల్లా సంక్షేమ పథకాల అమలులో ముందంజలో ఉందని, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఉపాధి కల్పన శాఖ ముఖ్య భూమిక పోషించాలని, ముఖ్యంగా యువతకు శిక్షణ కల్పించాలని, అలాగే ప్రభుత్వ మార్గదర్శకాల ద్వారా జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. బ్యాంక్ లు ముద్ర, పిఎం ఈజిపి, స్టాండప్ ఇండియా పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందించి ఆర్థిక చేయూత కల్పించాలన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాల ప్రతిభను అభినందిస్తు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. కార్మిక శాఖ ద్వారా ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు సౌకర్యం కల్పించి లబ్ధి చేకూరే విధంగా ప్రత్యేక కృషి చేయాలని పేర్కొన్నారు. వలస కూలీలకు ఉపాధి కల్పించాలని అన్నారు.

సంరక్షణ దిశగా భరోసా, సఖి కేంద్రాల ద్వారా వారి సమస్యలకు సంబంధించిన కేసులను ప్రత్యేక దృష్టి సారించి అనుబంధ శాఖల అధికారులు పరిష్కరించాలన్నారు. అర్హులైన వృద్ధులకు వృద్ధాప్య కార్డులు జారీ చేయాలని, వారికి సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించాలని పేర్కొన్నారు. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ లో సూచనల బాక్స్ పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డిడబ్ల్యుఓ అక్కేశ్వరరావు, ఎల్ డి ఎం సుబ్రహ్మణ్యం, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆశన్న, డి టి డబ్ల్యూ ఓ కోటాజి, డిసిపి లావణ్య నాయక్, వయోవృద్ధుల శాఖ ఏడి రాజేందర్, ఉపాధి కల్పన అధికారి ఎ.వందన, కార్మిక శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, డి సి పి ఓ శ్రీనివాస్,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story

Most Viewed