నిత్యావసర సరుకులు పంపిణీ

by Shyam |
నిత్యావసర సరుకులు పంపిణీ
X

దిశ, మెదక్: లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో జర్నలిస్టులకు, ఆటో డ్రైవర్లకు, వలస కూలీలకు నిత్యావసర సరుకులను అందించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్‌తో అగ్రదేశాలు సైతం అతలాకుతలం అవుతున్నాయన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ , సీఎం కేసీఆర్ లాక్‌డౌన్‌ పొడిగించారని చెప్పారు. ప్రభుత్వ సూచనలను పాటిస్తూ పోలీసులు, వైద్యులకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.

Tags: MLA Padma Devendar Reddy, Distribution, Essential Goods, medak

Advertisement

Next Story