- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఈ ఎమ్మెల్యే అందరికీ ఆదర్శనీయుడు'
దిశ, మర్పల్లి: వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నానని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడిలో అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్ల పల్లి రమేష్ కుమార్ మాట్లాడుతూ నీతో నేను అంటూ ప్రతిరోజు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ గ్రామగ్రామాన పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఆనంద్ అందరికీ ఆదర్శనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి పేట పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ముక్తహర్ షరీఫ్, కో-ఆప్షన్ సభ్యుడు రాజమల్లు, నాయకులు ముర్తుజా కృష్ణ భారత్ సత్యనారాయణ రెడ్డి, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.