- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సమస్యలపై… అసెంబ్లీలో నిలదీస్తా
దిశ, మునుగోడు: సమస్యల పరిష్కారం కోసం గత 25 రోజులుగా నిరాహారదీక్షలు చేస్తున్న చేనేత కుటుంబాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కరోనా మహమ్మారి మూలంగా నేతన్నలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం మాదిరి తెలంగాణ ప్రభుత్వం కూడా నేతన్నలకు తక్షణమే ఆర్థికసాయం చేయాలని కోరారు.
మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే చేనేత కార్మికులు ఉన్నారా..? మిగతా జిల్లాల్లో లేరా అని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత వస్త్రాలపై విధించిన జీఎస్టీని వెంటనే తొలగించాలని, పేరుకుపోయిన చేనేత వస్త్రాలను వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చేనేతల సమస్యలపై రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని నేతన్నలకు భరోసా ఇచ్చారు. తన తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద నేతన్నల కుటుంబాలకు మూడు నెలలకు సరిపడా సరుకులను పంపిణీ చేశారు.