- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయనది ఐరన్ లెగ్గా..? ఇక కాంగ్రెస్ శకం ముగిసినట్లేనా..?
దిశ తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ పీసీసీ పదవికి ఏడాదిగా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని… ఓటుకు నోటు కేసులో రేవంత్‌ది ఖైదీ నెంబర్ 1779 అని పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మన్ (పీయూసీ), ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఆరు నెలలకు ఒక (పార్టీ)రక్తం మారుతుందని, ఆయనది ఫాదర్ ఆఫ్ ది ఐరెన్ లెగ్ అన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ శకం ముగిసినట్లేనని, ఊసరవెల్లి లాగా రక్తం మార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి కాదు.. ఆయన పెయింటర్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియదన్నారు. టీఆర్ఎస్ ది క్యాట్ వాక్ కాదు.. రేవంత్ రెడ్డిది జైల్ వాక్ అని అన్నారు. పదవులు వస్తే హుందాగా మాట్లాడాలని సూచించారు. సీఎం కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్‌ను విమర్శించే ముందు నీ పార్టీని బాగుచేసుకో అని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడం కాంగ్రెస్ నేతలకు ఎవ్వరికీ ఇష్టం లేదని చెప్పారు. సోనియాగాంధీ అంటే తెలంగాణ సమాజానికి ఒక అభిమానం ఉండేదని, ఆ అభిప్రాయం కాస్తా రేవంత్ కు పీసీసీ ఇవ్వడంతోనే పోయిందన్నారు. రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీ అయ్యాక రోడ్డెక్కితే అభివృద్ధి కనిపిస్తుందని సూచించారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే జైల్ పార్టీఅని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని ధ్వజమెత్తారు. రేవంత్ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని… గుండు అరవింద్ ముందు బాండ్ పేపర్ పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బ్లాక్ మెయిల్‌కి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. రూ.50వేల కోట్ల వరకు హైదరాబాద్ పై ఖర్చు చేశామని, హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ కు వెళ్తే మలేషియా వెళ్లినట్లు అనిపిస్తోందని తెలిపారు. విమర్శలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని రేవంత్‌కు సూచించారు.