- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎమ్మెల్యే చిందులు.. కరోనా రోగుల చప్పట్లు
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కాటుకు ఎంతో మంది బలి అవుతున్నారు. ఇందులో కరోనా సోకిందని మనోవేదనకు గురై చనిపోతున్నవారున్నారు. కొంత మంది ఆసుపత్రిలోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబాలకు దూరమై వారు పడే బాధ అంతా ఇంతా కాదు. అయితే కరోనాతో క్వారంటైన్ల చికిత్స తీసుకుంటూ ఒత్తిడి ఎదుర్కొంటోన్న వారిలో ఉత్సాహం నింపేందుకు ఓ ఎమ్మెల్యే కరోనా వార్డులో డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోసోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కర్ణాటకలోని మలవాలీ ఎమ్మెల్యే అన్నదాని కరోనా రోగుల్లో ఉత్సాహం నింపడానికి డ్యాన్స్ చేశారు. ఆయన డ్యాన్స్ చూసిన కరోనా రోగలందరూ సంతోషంతో చిందులేశారు. ఆయన స్వతహాగా జానపద గాయకుడు కావడంతో అక్కడ పలు పాటలకు డ్యాన్స్ చేయడం అందరినీ అలరించింది. కరోనా రోగులందరూ ఉత్సాహంగా ఉండాలని, ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుడదని ఆయన తెలిపారు.
Next Story