టీఆర్ఎస్‌ని, మా అన్న బాల్క సుమన్‌ని విమర్శిస్తే నిన్నేకాదు ఎవరినైనా చంపుతాం

by Anukaran |   ( Updated:2020-12-16 20:51:56.0  )
టీఆర్ఎస్‌ని, మా అన్న బాల్క సుమన్‌ని విమర్శిస్తే నిన్నేకాదు ఎవరినైనా చంపుతాం
X

దిశ, వెబ్ డెస్క్ : టీఆర్ఎస్‌ని, మా అన్న బాల్క సుమన్‌ని విమర్శిస్తే నిన్నే కాదు ఎవరినైనా చంపుతాం అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు ఉస్మానియా యూనివర్సిటీలో వీరంగం సృష్టించారు. బీర్ సీసాలతో, మారణాయుధాలతో విద్యార్ధిపై దాడి చేశారు. ఈ దాడిలో దుండగుల నుంచి ప్రాణ భయంతో ఉస్మానియాయూనివర్సిటీ నుంచి పరుగులు తీస్తూ బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు.

ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్ధి సురేష్ యాదవ్ గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యార్ధి వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్కసుమన్ కు చెందిన 20 మంది అనుచరులు బుధవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన హాస్టల్ రూమ్ లో ఉన్న విద్యార్ధి సురేష్ యాదవ్ ను మారణాయుధాలతో వెంబడించారు. మద్యం సీసాలతో దాడి చేస్తూ మా బాల్కసుమన్ ని, టీఆర్ఎస్ పార్టీని కానీ విమర్శిస్తే నిన్నే కాదు ఎవరినైనా చంపుతాం అంటూ దాడి చేశారు. ఈ దాడి సమయంలో సురేష్ యాదవ్ ప్రాణభయంతో పరుగులు తీస్తూ రీసెర్చ్ సెంటర్ సమీపంలో ఉన్న చెట్టు పొదల్లో దాక్కున్నారు.

అనంతరం ఉస్మానియా క్యాంపస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు ఎమ్మెల్యే బాల్కసుమన్ నుంచి ప్రాణ హాని ఉందని, తక్షణమే తనపై దాడి చేసిన నిందితుల్ని అరెస్ట్ చేయాలని విద్యార్ధి సురేష్ యాదవ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story