కామారెడ్డిలో దారుణం.. మిస్సింగ్ దంపతుల్లో ఒకరు కాలిపోయి, మరొకరు గుంతలో పడి!

by Sumithra |
కామారెడ్డిలో దారుణం.. మిస్సింగ్ దంపతుల్లో ఒకరు కాలిపోయి, మరొకరు గుంతలో పడి!
X

దిశ, కామారెడ్డి : మూడు రోజుల కిందట భార్యాభర్తలిద్దరూ చిన్నపాటి కుటుంబ కలహాలతో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ శివారులో 45 నుంచి 50 సంవత్సరాల వయసు గల ఓ వ్యక్తి కాలిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది. పక్కనే ఉన్న గుంతలో ఓ మహిళ మృతదేహం కూడా లభ్యమైంది. మృతులిద్దరూ మూడు రోజుల కిందట అదృశ్యమైన భార్యభర్తలుగా పోలీసులు గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనికి చెందిన కోదండం సాయిలు, అతని భార్య పోచవ్వ ఈ నెల 28న ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి డబ్బుల విషయంలో గొడవ పడ్డారు. దాంతో ఇద్దరు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఈరోజు ఇందిరానగర్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి కాల్చుకుని మృతి చెందినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి చూడగా పక్కనే ఉన్న గుంతలో మహిళ మృతదేహం కూడా లభ్యమైంది. మృతి చెందిన ఇద్దరు కోదండం సాయిలు (40), పోచవ్వ(30)గా పోలీసులు గుర్తించారు. సాయిలు కాల్చుకుని ఆత్మహత్య చేసుకోగా భార్య పోచవ్వ గుంతల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story