ఇంటి సమీపంలో కనిపించిన విప్పేసిన డ్రెస్.. అనుమానొచ్చి లోపలికి వెళ్లి చూస్తే..

by Sridhar Babu |
Baludu-died1
X

దిశ, రాజేంద్రనగర్ సర్కిల్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్ గూడ సిరిమల్లె కాలనీలో నివాసం ఉండే శివశంకర్, అపర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు అనీశ్ (6) గురువారం రోజు ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఇంటికి సమీపంలో ఉన్న ఓ కుంట దగ్గరకు వెళ్లి స్నానానికని నీళ్లలోకి దిగాడు. అయితే అనీశ్ కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుంట ఒడ్డుపై బాలుడి బట్టలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story