మైనర్ బాలిక అత్యాచార కేసు..ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్..

by Sumithra |
మైనర్ బాలిక అత్యాచార కేసు..ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్..
X

దిశ, కరీంనగర్ సిటీ :సెకండరీ గ్రేడ్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామ్ రాజయ్యను, సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. మైనర్ బాలికను లొంగదీసుకుని గర్భవతిని చేసిన యువకునికి సహకరించిన కేసులో, ఫోక్సో చట్టం ప్రకారం గత నెల 30న పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. అయితే, ప్రభుత్వోద్యోగి సిసిఎస్ నిబంధనల ప్రకారం 48గంటలకు మించి రిమాండ్ లో ఉంటే సస్పెన్షన్ అనివార్యం కాగా, విధుల్లో నుంచి తొలగించినట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. డిప్యుటేషన్ పై మానకొండూరు మండలం వేగురుపల్లి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న రామ్ రాజయ్య ఆది నుంచి వివాదాస్పదుడనే పేరుంది. ఇప్పటికే రామ్ రాజయ్య తన 19 ఏళ్ళ సేవా కాలంలో, తాను పనిచేసిన ప్రతి పాఠశాలలో ఏదో ఒక వివాదంతో నాలుగు సార్లు సస్పెండ్ అవడం గమనార్హం

Advertisement

Next Story