- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వేములవాడ మండలంలో మంత్రుల పర్యటన
X
దిశ, వేములవాడ: సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి పర్యటించనున్నారు. ఈనెల 11న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాగరం గ్రామంలో రూ.60 లక్షలతో కోదండ రామస్వామి ఆలయ పునరుద్ధరణ లో భాగంగా పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు.
అలాగే ఈనెల 12న మంత్రి జగదీష్ రెడ్డి ధర్మారం గ్రామంలో 1 కోటి 30 లక్షలతో 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. అలాగే కోనరావుపేటలో రూ.1కోటి 30 లక్షలతో నిర్మించిన 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసి నిమ్మపల్లి గ్రామంలో రూ.16 కోట్లతో నిర్మించిన 133/32 కెవి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేయనున్నారు.
Advertisement
Next Story