మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన మంత్రులు సత్యవతి, మల్లారెడ్డి

by Sridhar Babu |
Mi-sri-1
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అతని కుటుంబ సభ్యులకు పరామర్శల పరంపర కొనసాగుతోంది. ఇటీవల శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ దివంగతులైన నేపథ్యంలో గత వారం రోజుల నుంచి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు తరలివచ్చి తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మంత్రులు సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ కుమార్, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, రేగా కాంతారావు, ఎమ్మెల్సీ శంబీ పూర్ రాజు, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మాచారి, టీయూడబ్ల్యూజే నేతలు మారుతి సాగర్, రమణ, తెంజు అధ్యక్షుడు ఇస్మాయిల్, జేపీఎంసీ చైర్మన్ రవి కుమార్, వివిధ సంఘాల నేతలు, సభ్యులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ సమాధి, చిత్రపటాల వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

MI-3

Mi-sr2

Advertisement

Next Story

Most Viewed