- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో ప్లీనరీ సమావేశం.. పూర్తి కానున్న ఏర్పాట్లు
దిశ, శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 25న నిర్వహించే ప్లీనరీ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆహ్వాన కమిటీ సభ్యులు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ లు పరిశీలించారు.
ప్లీనరీకి వచ్చే ప్రతినిధుల వాహనాల కోసం ఏర్పాట్లు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలపై ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, జీహెచ్ఎంసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత కాలానికి ముందే ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని సంబంధిత ఇంచార్జీలకు సూచించారు. అలాగే అధికారులు, పోలీసుల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద వారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఐఐసీ ఛైర్మెన్ బాలమల్లు, సివిల్ సప్లై ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Tags
- mp ranjith reddy