కుట్రలతోనే ఆలయాలపై దాడులు

by srinivas |
Minister Vellampalli Srinivas
X

దిశ, ఏపీ బ్యూరో: కుట్రలతోనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. సోమవారం విశాఖ శారదా పీఠాన్ని సందర్శించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమ పథకాలకు ఆశీస్సులు కావాలని స్వామిని కోరినట్లు తెలిపారు. అన్యాక్రాంతమైన ఆలయాల భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాలను చంద్రబాబు కూల్చివేశారని, ఆలయాలను పున: నిర్మించాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని మంత్రి వెల్లడించారు. పంచగ్రామాల సమస్య పరిష్కారానికి సీఎం కమిటీ వేసినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ట్వీట్లను ఎవరూ పట్టించుకోవద్దని స్పష్టం చేశారు.

Advertisement

Next Story