తాడు బొంగరం లేని వాళ్లే టీఆర్ఎస్‌ను విమర్శిస్తున్నారు

by Shyam |
తాడు బొంగరం లేని వాళ్లే టీఆర్ఎస్‌ను విమర్శిస్తున్నారు
X

దిశ, తెలంగాణ బ్యూరో : దళిత బంధు పథకంపై మాట్లాడే వారంతా మూర్ఖులేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. ఈ నెల 7న జలవిహార్‌లో జరిగే టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జంట నగరాల విస్తృతస్థాయి సమావేశం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. తాడు బొంగరం లేని వాళ్ళు టీఆర్ఎస్‌ను, సీఎం కేసీఆర్ విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు పథకం పై అవాకులు చవాకులు మాట్లాడే నాయకులు వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ అని, అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలు తీర్చింది టీఆర్ఎస్ పార్టీ అని.. కళ్లుండి చూడలేని స్థితిలో విపక్షాలు ఉన్నాయని దుయ్యబట్టారు. తాడు బొంగరం లేని వాళ్ళు టీఆర్ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి బస్తీ నుండి హైదరాబాద్ వరకు కమిటీ ఎన్నికలపై చర్చించనున్నట్టు వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు స్థానిక మంత్రులు, స్థానిక పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. కమిటీలపై వర్కింగ్ ప్రెసిడెంట్ దిశానిర్దేశం చేస్తారన్నారు. ఆయన వెంట పలువురు ప్రజా ప్రతినిధులు కార్పొరేటర్లు ఉన్నారు.

Advertisement

Next Story