- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వారికి క్షమాపణ చెప్పేందుకు సిద్ధం :తలసాని
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల కోకాపేటలో జరిగిన ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో గంగపుత్రులను బాధపెట్టేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.
తన వ్యాఖ్యలు గంగపుత్రుల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని అనిపిస్తే.. వారికి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కేసీఆర్ గంగ పుత్రులకు చెరువులు, కుంటలు మీద సర్వాధికారాలు ఇవ్వాలని అసెంబ్లీలో చెప్పిన విషయాన్నే తాను ప్రస్తావించానని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు గంగపుత్రులను పట్టించుకునేవారే లేరని తలసాని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమం కోసం కృషి చేస్తోందని తెలిపారు.
Advertisement
Next Story