- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ సేవలు ఎనలేనివి : మంత్రి తలసాని
దిశ, కంటోన్మెంట్: పారిశుధ్య నిర్వహణలో జీహెచ్ఎంసీ సిబ్బంది సేవలు ఎనలేనివని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బందికి మాస్కులు, రెయిన్ కోట్, శానిటైజర్, గ్లౌస్ తదితర 10 రకాల సామాగ్రితో కూడిన కిట్ లను మంత్రి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం పారిశుధ్య పనులలో ఉండే కార్మికుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుధ్య సిబ్బందికి ఈ కిట్ లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో కిట్ విలువ 6,710 రూపాయలు అని, బేగంపేట సర్కిల్ లో 2,375 మంది సిబ్బందికి ఈ కిట్ లను పంపిణీ చేసినట్లు చెప్పారు. వర్షాకాలంలో ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకునేందుకు అవసరమైన సామాగ్రిని అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో విధి నిర్వహణలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీ ముకుందరెడ్డి, హెల్త్ ఆఫీసర్ రవీందర్ గౌడ్, ఎంట మాలజీ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.