కేటీఆర్ బర్త్ డే.. గిఫ్ట్‌గా 15 అంబులెన్సులు

by Shyam |
కేటీఆర్ బర్త్ డే.. గిఫ్ట్‌గా 15 అంబులెన్సులు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ఉదారత్వాని చాటుకున్నారు. కేటీఆర్ ప్రకటించిన విధంగానే జిల్లా ప్రజాప్రతినిధులు కూడా అంబులెన్స్‌లు సమకూర్చేందుకు ముందుకు వచ్చారు. కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లిన ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు సైతం అంబులెన్సులు సమకూరుస్తామని వెల్లడించారు. తనతో పాటు మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్.రాజేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తరపున మొత్తం 15 అంబులెన్సులు సమకూర్చనున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇవన్నీ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కరోనాపై పోరుకు ఉమ్మడి జిల్లాకు ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ అంబులెన్స్ లలో అన్ని సౌకర్యాలుంటాయని, కరోనా టెస్టులు కూడా చేసే వీలుంటుందన్నారు. కరోనాపై పోరుకు ఈ అంబులెన్సులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన వివరించారు. ప్రభుత్వపరంగా అంబులెన్స్‌లను సమకూరుస్తున్నప్పటికీ వీటి అవసరం ఎక్కువగానే ఉంటోందని, కరోనా టెస్టులను కూడా చేసేలా రూపొందించడంతో చాలా ఉపయోగం ఉంటుందన్నారు.

Advertisement

Next Story