- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో క్రీడాహబ్‌గా తెలంగాణ : శ్రీనివాస్ గౌడ్
దిశ, వెబ్‌డెస్క్: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని క్రీడలశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఎల్బీ స్టేడియంలో 7H మీడియా ప్రీమియర్ లీగ్(MPL) సీజన్-2 పోస్టర్, జెర్సీని క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నిత్యం వార్తా సేకరణలో బిజీగా ఉండే జర్నలిస్టుల కోసం.. మానసిక ఉల్లాసాన్ని కలిగించాలని, ఫిబ్రవరి 22నుంచి నిర్వహించబోతున్న క్రికెట్ లీగ్ నిర్వాహకులను, స్పాన్సర్‌లను మంత్రి అభినందించారు.
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడల అభివృద్ధికి సీఎం కేసీఆర్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించారని తెలిపారు. భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ టోర్నమెంట్‌లో 16 ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల విలేకరులు పాల్గొంటున్నారని వెల్లడించారు. అనంతరం 16 మీడియా సంస్థల కెప్టెన్ల సమక్షంలో టౌర్నమెంట్‌లో పాల్గొనే జట్ల జెర్సీలను డ్రా తీసి నిర్వాహకులకు అందించారు. ఈ టౌర్నమెంట్‌ను టీ20 క్రికెట్ లీగ్, నాకౌట్ పద్దతిలో నిర్వహించబోతున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న 7H Sportsను మంత్రి అభినందించారు.