- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ కవితకు థ్యాంక్స్ చెప్పిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత 100 కరోనా బెడ్లను కేటాయించారు. ఈ మేరకు ఈ విషయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ట్విట్టర్ ద్వారా కవిత సమాచారం అందజేశారు. వలస కూలీలు, కరోనా పేషెంట్‌లకు సిన్‌జెంటా ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ఆసుపత్రులకు 100 కరోనా బెడ్లను కేటాయిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ పెట్టెను కల్వకుర్తి, జడ్చర్ల, బాలానగర్ పీహెచ్‌సీలకు, అచ్చంపేట, కోయిలకొండ, మద్దూరు, కొల్లాపూర్, వీపనగండ్ల పీహెచ్‌సీలో ఏర్పాటు చేసే విధంగా బెడ్లను కేటాయించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 100 కరోనా బెడ్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.