- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ కథనానికి అనాథల ఆకలి తీరింది
దిశ, మహబూబ్ నగర్: ఆకలికేకలు అనే ప్రధాన శీర్షికతో గురువారం నాడు దిశలో వచ్చిన వార్తకు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. లాక్ డౌన్ కారణంగా జిల్లాలో చాలా మంది యాచకులు, అనాథలు ఆకలితో అలమాటిస్తున్నారని వార్త రూపంలో దిశ డిజిటల్ మీడియా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిరాశ్రయులు, భిక్షాటన చేసుకొని జీవించే వారి కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజేంద్రనగర్ మున్సిపాలిటీ కమ్యూనిటీ హాల్లో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు ఆశ్రయం ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి స్వయంగా వారిని కమ్యూనిటీ హాల్లోకి ఆహ్వానించి, వారికి భోజనం అందేలా చర్యలు తీసుకున్నారు.. కరోనా ప్రభావంతో తినటానికి తిండి దొరకని పరిస్థితిలో తమకు ఉండటానికి ఆవాసం, భోజనం ఏర్పాటు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తిండి దొరకక అల్లాడుతున్న యాచకుల కొరకు ప్రత్యేకంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత భోజన వసతిని మంత్రి పరిశీలించారు. భోజన వసతి కొరకు పట్టణంలోని బస్ స్టాండ్‌లో, అవసరాన్ని బట్టి ఉచిత భోజన సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
tag: disha effect, srinivas goud, Orphans, beggars, hunger, mahabubnagar