బ్రిడ్జి పనులను పరిశీలించిన శ్రీనివాస్ గౌడ్

by Shyam |   ( Updated:2020-03-29 05:44:27.0  )
బ్రిడ్జి పనులను పరిశీలించిన శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్‎నగర్: మహబూబ్‎నగర్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో నిర్మాణమవుతున్న బ్రిడ్జి పనుల పురోగతిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. యంత్రాల ఆధారిత పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రహదారి మరమ్మతు పనులు నిర్వహించడానికి అనువైన సమయమని.. ఈ సమయంలోనే బ్రిడ్జి నిర్మాణంతో పాటు రహదారి మరమత్తులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. యంత్రాల ఆపరేటింగ్ సిబ్బంది కరోనా పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

Tags: Srinivas Goud, examined, bridge works, mahabubnagar

Advertisement

Next Story