- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంత్రి శ్రీనివాస్ గౌడ్ వింత జవాబు.. వింటే విస్తుపోవాల్సిందే!
దిశ, వెబ్‌డెస్క్: కొండ పోచమ్మ కాలువకు గండి పడితే జరగరానిది ఏదో జరిగినట్లు విపక్షాల నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చెరువులు, కాలువలకు గండి పడకపోతే మనుషులకు పడతాయా? అని ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘మీరు ప్రాజెక్టులు కట్టలేదు..నీళ్లు రాలేదు కాబట్టే గండ్లు పడలేదు..గండ్లు పడితే పూడుస్తారు. మళ్లీ నీళ్లు ఇస్తారు.. ఎందుకు రాద్ధాంతం?’ అని ఫైర్ అయ్యారు. అప్పుడప్పుడు వచ్చే రామ్ మాధవ్ కూడా సగం ప్రాజెక్టు అంటూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామంటూ రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ఇంటికి పంపిస్తామని భయపెడుతున్నారా? అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ వల్లే పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరిగిందని మంత్రి వివరించారు.