మంత్రి కుమారుడికి కరోనా

by srinivas |   ( Updated:2020-07-10 02:58:45.0  )
మంత్రి కుమారుడికి కరోనా
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుమారుడికి కరోనా సోకింది. ధర్మాన కృష్ణదాస్ తరపున నియోజకవర్గంలో ఆయన కుమారుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో ఆయనకు వైరస్ సోకినట్టు తేలింది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్ కుమారుడితో కలిసి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన కుమారుడికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో కృష్ణదాస్ క్యాంపు కార్యాలయాన్ని కూడా మూసేసి, 15 రోజుల పాటు ఎవరూ తమను కలవడానికి రావద్దని సూచించారు. దీంతో ఆయన హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. మరోవైపు అదే కార్యక్రమంలో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా పాల్గొన్నారు. దీంతో ఆయన కూడా 15 రోజుల పాటు తనను కలిసేందుకు ఎవరూ రావద్దని ప్రకటన జారీ చేసి, హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. దీంతో కృష్ణదాస్ కుమారుడితో కలిసి నియోజకవర్గంలో పర్యటించిన వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.

Advertisement

Next Story