- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రతి ఆదివారం సీజనల్ వ్యాధులపై క్యాంపెయిన్ : మంత్రి సబిత
దిశ, రంగారెడ్డి: సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఆదివారం ఉదయం పది నిమిషాల పాటు ప్రజలకు చికెన్ గున్యా,డెంగీ తదితర సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు క్యాంపెయిన్ నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్లను, పరిసరాలను శుభ్రపర్చుకోవాలని చెప్పారు. ఆదివారం ఆర్కెపురం డివిజన్లలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ క్యాంపెయిన్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ..మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ ను క్యాంపెయిన్ లో భాగస్వాములను చేయాలన్నారు. నిలిచిన నీటిని పారబోయాలని, దోమల లార్వా పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుధ్య కార్మికులను గౌరవించడం మన బాధ్యత అన్నారు.శానిటేషన్ విషయంలో రాష్ర్టానికి మంచి పేరు వచ్చిందని, దాన్ని కాపాడుకోవాలని కోరారు. కరోనాతో మరికొంత కాలం కలిసి బతకాల్సిందేనని, వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలన్నారు. మున్సిపాలిటీల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. విశాఖ ప్రమాద ఘటన దృష్ట్యా పరిశ్రమల విషయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.