ఎస్ఈసీ నిమ్మగడ్డకు హైకోర్ట్ షాక్

by srinivas |   ( Updated:2021-02-07 01:28:26.0  )
ఎస్ఈసీ నిమ్మగడ్డకు హైకోర్ట్ షాక్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కు హైకోర్ట్ షాకిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిమ్మగడ్డ రమేష్ స్పందిస్తూ డీఐజీకి లేఖరాశారు. మంత్రి పెద్దిరెడ్డి ఈనెల 21వరకు ఇల్లు కదలకుండా ఏర్పాట్లు చేయాలని లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ ఆదేశాలపై పెద్దిరెడ్డి హైకోర్ట్ ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్ట్.. ఎస్ఈసీ ఇచ్చిన హౌస్ అరెస్ట్ ఆదేశాలు చెల్లవని కొట్టిపారేసింది. కానీ పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడొద్దంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాల్ని హైకోర్ట్ సమర్ధిస్తూ తీర్పిచ్చింది.

Advertisement

Next Story