మీరెళ్లొచ్చు : మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్ట్ గ్రీన్ స్నిగ్నల్

by srinivas |
peddireddy
X

దిశ,వెబ్‌డెస్క్: మంత్రి పెద్దిరెడ్డి దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై హైకోర్ట్ లో వాదనలు ముగిశాయి. రాష్టపతి పర్యటనలో పాల్గొనేందుకు మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్ట్ అనుమతిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి ఈనె 21 వరకు ఇల్లు కదలొద్దని ఎస్ఈసీ ఆదేశించింది. అయితే రాష్ట్రపతి పర్యటనకు పెద్దరెడ్డికి ఆహ్వానం ఉండడంతో ఆయన ఇంటి నుంచి ఎయిర్ పోర్ట్ కు బయలుదేరి వెళ్లారు. అదే సమయంలో ఎస్ఈసీ ఆదేశాల్ని సవాల్ చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్ట్ లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్ట్..పెద్దిరెడ్డి రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనవచ్చని చెప్పింది. ఇక ఎస్ఈసీ ఆదేశాలపై మధ్యాహ్నం 12గంటలకు తీర్పిస్తామని హైకోర్ట్ తెలిపింది.

Advertisement

Next Story