పసుపు నాణ్యత పెంపుపై మంత్రి సమీక్ష

by Shyam |   ( Updated:2020-03-12 11:02:12.0  )
పసుపు నాణ్యత పెంపుపై మంత్రి సమీక్ష
X

దిశ, న్యూస్‌బ్యూరో :
తెలంగాణలోని పసుపు పంట నాణ్యత పెంపు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం సంబంధిత అధికారులు,మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పసుపు లేని వంట ఉండదు, కానీ అది పండించే రైతులకు మద్దతు ధర లేదు. అనేక ఔషధ గుణాలున్న పసుపుకు ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. కేరళలోని అలెప్పీపసుపుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అదే రకాన్నిఇక్కడి రైతులకు అందించి సాగులో మెళకువలు అందిస్తున్నాం. పసుపు నాణ్యత పెంచడంతో పాటు, ఎగుమతుల మీద దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అన్ పాలిష్డ్ పసుపుతో రైతులు నష్టపోతున్నట్టు తెలిసింది.మనవాళ్లు పండించిన పంటను ఉడికించి, ఎండబెట్టి మార్కెట్‌కు తెస్తున్నారు.900 ఏళ్లుగా పసుపు సాగును సంప్రదాయ బద్ధంగా సాగు చేస్తున్నారు.ఇక మీదట ప్రభుత్వమే పసుపును తీసుకుని ప్రాసెసింగ్ చేసే అవకాశాల మీద దృష్టి సారించండని అధికారులను మంత్రి కోరారు. పసుపులో కర్క్‌మెన్ శాతం పెంచితే ఎగుమతులు పెరిగి మద్దతుధర లభించే అశకాశం ఉంటుందన్నారు. ప్రపంచంలో పసుపు వాడకం తక్కువ కావున, కలర్స్, ఫార్మా రంగాల్లో దీని వినియోగం పెంచితే బాగుంటుందన్నారు. లాగే పసుపు మార్కెటింగ్‌లో సిండికేట్ వ్యవస్థ దోపిడిని నిలువరించాలన్నారు. మనవద్ద 1.33 లక్షల ఎకరాల్లో రూ.1687 కోట్ల విలువైన2.81 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి అవుతుంది. పసుపులో కల్తీని పూర్థిస్థాయిలో అరికట్టి, పీపీపీ మోడల్‌లో పసుపు ప్రాసెసింగ్, మార్కెటింగ్ అంశాలపై దృష్టి సారించాలన్నారు.పతంజలి లాంటి సంస్థలకు వసతులు కల్పిస్తే మన పసుపును పూర్తిగా వారే కొంటారేమో అనే విషయంపై చర్చించారు.ఈ సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అటవీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్, జీవన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉద్యాన శాఖ సంచాలకులు వెంకట్రాంరెడ్డి, మార్క్ ఫెడ్ ఎండీ భాస్కరాచారి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఆయుష్, ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారులు పాల్గొన్నారు.

Tags: turmeric crop, quality improve, minister review, all officers and political representatives attend

Advertisement

Next Story

Most Viewed