- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పటిదాకా ముందుకు వెళ్లొద్దు !
దిశ, న్యూస్‌బ్యూరో: ఏపీ సర్కార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు జీవోపై వెంటనే కృష్ణా బోర్డు సమావేశమై ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆదేశించారు. ప్రాజెక్టు ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘిస్తోందా లేదా అన్నది తేల్చాలని సూచించారు. అప్పటిదాకా ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ ముందుకు వెళ్లడానికి వీళ్లేదని తెలిపారు. ఈ మేరకు ఆయన కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి శనివారం ఒక లేఖ రాశారు. అంతకముందు పోతిరెడ్డిపాడుపై ఫిర్యాదు చేస్తూ బండి సంజయ్ రాసిన లేఖకు సమాధానంగా ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. త్వరలో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి పోతిరెడ్డిపాడు అంశంతో పాటు ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై ఉన్న ఇతర సమస్యలను చర్చించాలని తన శాఖ అధికారులకు సూచించినట్టు మంత్రి వివరించారు.