- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రకటనలు కాదు.. ముందు వ్యాక్సిన్ తెప్పించండి: కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర అనాలోచిత నిర్ణయాలతో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని టిమ్స్‌ను సందర్శించిన ఆయన.. నూతనంగా ఏర్పాటు చేసిన 150 పడకల ఐసీయూ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం కరోనాతో చికిత్స పొందుతున్న పేషెంట్లను పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌లను కొనుగోలు చేయాలని విమర్శించారు. కేవలం ప్రకటనలతో చేతులు దులుపుకుందన్నారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ విషయంలో ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నామని.. ఇందులో భాగంగా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటనలతోనే సరిపెట్టుకోకుండా.. ఇతర దేశాల నుంచి కూడా వ్యాక్సిన్‌లను తెప్పించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలు కొనాలనుకున్నా వ్యాక్సిన్ దొరకడం లేదన్నారు.
Live: Minister @KTRTRS speaking after inaugurating 150 bed ICU at TIMS, Gachibowli https://t.co/juvv2UsM4H
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 4, 2021