ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందజేస్తాం: మంత్రి కేటీఆర్

by Shyam |
ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందజేస్తాం: మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ గురువారం మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్లో కలిసింది. ఈ సందర్భంగా తన జీవితం ఆధారంగా వచ్చిన “పూర్ణ” పుస్తకాన్ని మంత్రి కేటీఆర్‌కు అందజేయగా ఆమెను అభినందించారు.

భవిష్యత్ ప్రణాళికల గురించి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. భవిష్యత్ ప్రయత్నాలకు సైతం గతంలో మాదిరే ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహం పట్ల పూర్ణ మంత్రి కి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story