ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో అగ్రస్థానం

by Shyam |
ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో అగ్రస్థానం
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఈజ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ ప్రభుత్వం వరుసగా అగ్రస్థానంలో నిలుస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణలో ప్రమోషన్ విభాగానికి అత్యంత కీలకమైన ప్రాధాన్యత ఉందన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ పెట్టుబడిదారులకు అవసరమైన సంపూర్ణ సమాచారాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలతో స్నేహపూర్వక పోటీని కొనసాగిస్తూనే తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం తరఫున తమ ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ గురువారం ప్రారంభమైంది.

మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రం‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలిసి మంత్రి కేటీఆర్ వెబ్సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇప్పటికే వెబ్‌సైట్‌లో పలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన లైవ్ లింక్‌లను ఉంచామని, తద్వారా ఆయా సేవలను పెట్టుబడిదారులు నేరుగా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఈ వెబ్సైట్ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో వెబ్సైట్లో అంతర్జాతీయ భాషల్లోనూ వెబ్ సైట్‌ని తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, ఐటీ శాఖలు, ఇన్వెస్ట్ తెలంగాణ విభాగం కలిసి ఈ వెబ్ సైట్ ను రూపొందించింది. ఈ వెబ్సైట్ పై ఎవరైనా మరింత సమాచారం లేదా ఫీడ్‌బ్యాక్ అందించాలనుకుంటే [email protected]. పంపాలని పరిశ్రమల శాఖ సూచించింది. https://invest.telangana.gov.in/ లింక్ ద్వారా వెబ్ సైట్ ను సందర్శించవచ్చు అని తెలిపింది.

Advertisement

Next Story