అభివృద్ధిలో అసంతృప్తి.. 100 పడకల ఆస్పత్రికి కేటీఆర్ భూమి పూజ

by Shyam |
అభివృద్ధిలో అసంతృప్తి.. 100 పడకల ఆస్పత్రికి కేటీఆర్ భూమి పూజ
X

దిశ, అలంపూర్ : అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు పట్టణ చౌరస్తాలో 100 పడకల అస్పత్రికి మంగళవారం ఉదయం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో అలంపూర్ చౌరస్తాకు రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు రాములుతో కలిసి చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా భూమి పూజ స్థలానికి చేరుకుని పూజా కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. అనంతరం చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని అల్పాహార విందులో పాల్గొన్నారు. అక్కడి నుంచి వారు హెలికాప్టర్ ద్వారా జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు.

ఉసురుమన్న కార్యకర్తలు..

కేటీఆర్ పర్యటనలో నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. కానీ, కేటీఆర్ ఏమీ మాట్లాడకపోవడంతో కార్యకర్తలు ఉసురుమంటూ అసంతృప్తితో వెనుదిరిగారు.

Advertisement

Next Story