- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అధికారిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం.. కోపంతో ఫోన్ విసిరేసి(వీడియో)

X
దిశ, జమ్మికుంట : మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహంతో అధికారిపై మండిపడ్డారు. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ఆయన ఓ అధికారిపై సీరియస్ కావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చెప్పారు..? విజిట్ చేసేందుకు వస్తున్నామంటే నువ్వేమో ఫోను పట్టుకుని బిజీగా ఉంటావు, ఆ చాపలు ఎవరు వేయించాలే.? ఏర్పాట్లు ఎవరు చేయాలి..? ఇంత అలసత్యం ఏందయ్యా..? మాకంటే ఎక్కువ బిజీనా నువ్వు.. ఎంత మందితో మాట్లాడుతున్నాం మేము అంటూ ఫోన్ దూరం విసిరారు మంత్రి కొప్పుల.
అసలు బాధ్యత ఉందా..? నేను నీతో మాట్లాడుతుంటే ఫోన్లు మాట్లాడుతున్నావంటూ కొప్పుల.. అధికారిపై సీరియస్ అయ్యారు. జమ్మికుంట పట్టణంలోని 21వ వార్డులో దళిత బంధు సర్వే సందర్బంగా ఈ పరిణామం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఏది ఏమైనా మంత్రి కొప్పుల అసహనం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.
Next Story