- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసలు ఏం జరిగింది?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆదివారం తన బృందంతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసాను సందర్శించడానికి వెళ్లారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు భైంసాలో జరిగిన దాడులకు కారకులెవరు..అసలు ఏం జరిగిందని బాధితులను అడిగి తెలుసుకోనున్నారు. అంతమంది ఒక్కసారిగా వచ్చి దాడులకు పాల్పడుతుంటే పోలీసు ఉన్నతాధికారులు ఎం చేశారు,వారి నుంచి వివరణ తీసుకుంటారని తెలుస్తోంది.మూక దాడుల్లో సర్వం కోల్పొయిన బాధితులకు అండగా ఉంటామని కేంద్రమంత్రి ఇదివరకే వెల్లడించారు. అయితే తెలంగాణ ప్రభుత్వమే పరోక్షంగా మూక దాడులను ప్రోత్సహించిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.బాధితులను పరామర్శించి వారికి ధైర్యం ఇచ్చేందుకే కిషన్‌రెడ్డి భైంసాకు వెళ్లినట్టు సమాచారం.
నిజామాబాద్ మీదుగా భైంసాకు వెళుతుండగా జిల్లా అధ్యక్షులు పల్లె గంగా రెడ్డి, ఎంపీ అరవింద్, రాష్ట్ర నాయకులు వినయ్ రెడ్డీ, బస్వా లక్ష్మి నర్సయ్యలు పుష్పగుచ్చాలు ఇచ్చి మంత్రికి స్వాగతం పలికారు.మంత్రితో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్,ఎమ్మల్సీ రాంచందర్ రావులు వెళ్లారు.