ఏలేరు విషాదాన్ని మిగిల్చింది….

by srinivas |   ( Updated:2020-10-17 05:09:48.0  )
ఏలేరు విషాదాన్ని మిగిల్చింది….
X

దిశ, వెబ్ డెస్క్:
ఏలేరు విషాదాన్ని మిగిల్చిందనీ, దీంతో ఆయకట్టులో 90 శాతం పంటలు నాశనం అయ్యాయనీ మంత్రి కన్నబాబు అన్నారు. ఏలేరు ఆయకట్టు ముంపు ప్రాంతాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మూడు నెలలుగా జిల్లా అంతా వరదలతో అతలాకుతలం అయిందని ఆయన అన్నారు. నష్టంపై సర్వేకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఏలేరు కాలువ ఆధునీకరణ అవసరమనీ ఆయన చెప్పారు. ఏలేరు ఆయకట్టు పరివాహక ప్రాంతాన్ని రీ సర్వే చేస్తామని ఆయన వెల్లడించారు. హైవే నిర్మాణం కూడా లోపభూయిష్టంగా ఉందని ఆయన తెలిపారు.

Advertisement

Next Story