‘క్రమశిక్షణతో కరోనాను కట్టడి చేశాం’

by Shyam |
‘క్రమశిక్షణతో కరోనాను కట్టడి చేశాం’
X

దిశ, నల్లగొండ: ప్రజలు క్రమశిక్షణ పాటించడంతోనే కరోనా మహమ్మారిని సూర్యాపేట జిల్లాలో కట్టడి చేయగలిగామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిబంధనలు, వైద్యుల సలహాలను సూర్యాపేట ప్రజలు పాటించి కరోనాపై విజయం సాధించారన్నారు. సూర్యాపేట పట్టణంలోని జూనియర్ కాలేజ్, అఫ్జల్ రైస్ మిల్లుల వద్ద ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను బుధవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం జమ్మిగడ్డలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్‌లో తెలంగాణ సెక్యుర్డ్ డ్రైవర్స్ అసోసియేషన్‌కు చెందిన 400 మంది కారు డ్రైవర్లకు మంత్రి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కరోనా ఆపత్కాలంలో పేదలకు ప్రభుత్వం చేస్తున్న సహాయానికి తోడుగా దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నాయని మంత్రి కొనియాడారు. ప్రజలు స్వీయ నిబంధనలు పాటించి, ప్రతీ క్షణం జాగ్రత్తగా ఉండాలన్నారు. రానున్న వానకాలం సీజన్‌లో విత్తనాలు, ఎరువులు, మోటార్ వైండింగ్, యంత్రాల దుకాణాల వంటివి తెరిచే ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed