- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పార్టీది కుక్క బుద్ధి : మంత్రులు
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ, నేతలపై మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ కుక్క బుద్ధిని ప్రదర్శిస్తుందని మంత్రి గుంటకండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మూర్ఖత్వం పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆయన మాట్లాడారు.
ఉత్తమ్ గ్యాంగ్ మాటలు వింటుంటే వారి బానిస మనస్తత్వం బయటపడుతోందని అన్నారు. ప్రజలు ఎన్ని సార్లు ఓడించినా కాంగ్రెస్ కు బుద్ధిరాలేదని, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కండ్లు తెరవాలని హితువు పలికారు. కొత్త సెక్రటేయేట్ కడుతుంటే మీ బాధ ఏంటని ప్రశ్రించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే కొత్త సచివాలయం కాడుతున్నామని, ఈ విషయాన్ని ఎన్నికల మేనిపోస్ట్ లోనే చెప్పామని గుర్తు చేశారు.
కోర్టుల్లో కేసులు వేసి యాదాద్రి పవర్ ప్లాంట్, పాలమూరు ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకున్నారని విమర్శించారు. కానీ మీ హయాంలో పెండింగ్ లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేశామని చెప్పారు. మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ప్రజలకు ఏమైన మేలు చేశారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనతో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని తెలిపారు. విద్యుత్ పంపిణీలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీటిని అందిస్తున్నామని, రైతుబంధు, రైతు బీమా పథకాలు ఎక్కడైనా ఉన్నాయా? అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు.