ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేలతో ఆ మంత్రి కీలక సమావేశం

by Shyam |
ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేలతో ఆ మంత్రి కీలక సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ సమస్యల పరిష్కారానికి పార్టీలకతీతంగా కలిసి ముందడుగు వేద్దామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో విద్యుత్ పద్దు చర్చలో భాగంగా పాతబస్తీ ప్రజలకు కరంట్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చేశామని, ఇంకా ఏవైనా సమస్యలుంటే నేరుగా తన ఛాంబర్‌కు వచ్చి చర్చించొచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పలువురు ఎమ్మెల్యేలు ఆయనను కలిశారు. విద్యుత్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సమక్షంలో ఆయా శాఖల వారీగా పూర్తి సమాచారాన్ని మంత్రి ఆ ఎమ్మెల్యేలకు తెలియజేశారు. ఎక్కడెక్కడ పనులు పూర్తి చేశారు, పెండింగ్‌‌లో ఉన్న పనులెన్ని, ఎన్ని నిధులు వెచ్చించారనే అంశాలన్నీ మంత్రి స్వయంగా వారికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఏ సమస్యలున్నా కలిసి పరిష్కిరించుకుందామని సూచించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లోని సమస్యలను మంత్రి జగదీశ్ రెడ్డికి విన్నవించగా.. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి సానుకూలంగా స్పందించడంపై ఎమ్మెల్యేలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed